Vijayakanth : తమిళ హీరో విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

-

తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్. డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ ఆస్పత్రి నుంచి తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గత నెల 18న చెన్నైలోని MIOT ఆస్పత్రిలో చేరిన విజయ్‌ కాంత్‌…క్రిటికల్‌ పరిస్థితులను ఎదుర్కొన్నారు.

DMDK founder, actor Vijayakanth gets discharged from hospital

ఒకనొక సమయంలో.. విజయ్‌కాంత్ మరణించారని కూడా వార్తలు వైరల్‌ చేశారు. కానీ విజయ్‌కాంత్ ది గట్టి గుండె కావడంతో..కోలుకున్నారు. ఇక ఇవాళ డీఎండీకే అధినేత, నటుడు విజయ్‌కాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, డీఎండీకే (దేశియ మురపొక్కు ద్రవిడ కజగం) పార్టీ అధినేత విజయ్ కాంత్ కొంత కాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఆయన కుడి కాలి వేళ్లకు బ్లడ్ సప్లై కావడం లేదని, ఈ నేపథ్యంలోనే వైద్యులు ఆయన మూడు కాలి వేళ్లు తొలిగించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news