మీ కథ ముగిసింది.. వెంటనే లొంగిపోండి: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

-

హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా హమాస్​ను అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్​ గాజాపై విరుచుకు పడుతోంది. ఇప్పటికే ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లను హతం చేసింది. తాజాగా హమాస్‌ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని హెచ్చరించారు. ‘పాలస్తీనియన్‌ గ్రూప్‌’ ముగింపు దగ్గరపడిందని ఇక లొంగిపోవడమే వారికున్న ఛాన్స్ అని పేర్కొన్నారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన నెతన్యాహు.. యుద్ధం ఇంకా కొనసాగుతోందని.. కానీ హమాస్‌ అంతానికి ఎంతో దూరం లేదని వ్యాఖ్యానించారు. హమాస్‌ ఉగ్రవాదులను. వెంటనే లొంగిపోమని ఆదేశించారు. గత కొన్నిరోజులగా పదులు సంఖ్యలో హమాస్‌ ఉగ్రవాదులు తమ బలగాల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. అయితే తమవారు లొంగిపోయినట్లు వస్తున్న వార్తలను హమాస్‌ తోసిపుచ్చింది. మరోవైపు మిలిటెంట్లు లొంగిపోయినట్లు ఇజ్రాయెల్‌ ఇంతవరకు సాక్ష్యం చూపెట్టలేదు.

అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందికిపైగా ప్రజలను కిరాతకంగా చంపి, 240 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచి ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news