సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ తరుణంలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని IA పిటిషన్ దాఖలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిన నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సినియర్ కౌన్సిల్ సభ్యులు కోరారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా అని ఈ సందర్భంగా హై కోర్టు ప్రశ్నించింది. సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని కోరింది యూనియన్. అయితే.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి విచారణ ఈ నెల 21 కు వాయిదా వేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.