ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బిస్ షో కేసు తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇటీవలే అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఘటనల్లో పాల్గొన్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు.
ఇందులో 12 మంది మేజర్లు భూపతి బాలకృష్ణ, మోహన్ కుమార్ భూపతి రాఘవేందర్, రంజిత్ కుమార్, మొలావల గణేష్, ధర్మపురి రోహిత్, సరళ రాఘవ, సురేందర్, రాపంతు నవీన్, సంతోష్, ఇదుమొళ్ల మహేష్, ధర్మపురి ఏసు రత్నంలు ఉన్నట్లు చెప్పారు. మిగిలిన నలుగురు మైనర్లుగా గుర్తించామని.. వారిని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఎదుట హాజరు పర్చనున్నట్లు చెప్పారు.
మరోవైపు ఇవాళ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. అతడి బెయిల్ పిటిషన్పై గురువారం రోజున కోర్టు వాదనలు వింది. ఈ నేపథ్యంలో ఇవాళ తీర్పు వెలువరించనుంది.