“నా సామి రంగా ” సినిమాకి థియేటర్ ల కరువు…. అసంతృప్తిలో కింగ్…..

-

కింగ్ నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న చిత్రం’ నా సామి రంగ’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా… ఆ తర్వాత వచ్చిన గోస్ట్ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈసారి నా సామి రంగ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతి ఫెస్టివల్ కి విడుదల చేస్తే ఫలితం కొంచెం అటు ఇటు ఉన్న ప్రేక్షకులు థియేటర్కు వచ్చి సినిమాను సక్సెస్ చేస్తారని భావిస్తున్నాడట. ఈ మేరకు సంక్రాంతి బరిలో నిలిచేందుకు చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

అయితే సినిమా యొక్క ప్రమోషన్ కంటెంట్ బాగా ఉన్నప్పటికీ సినిమాను రిలీజ్ చేసేందుకు తగినన్ని స్క్రీన్స్ దొరకడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే c ,d సెంటర్స్ లో పలు సినిమాలకి థియేటర్స్ లాక్ చేయబడ్డాయి. అలాగే ఏ, బి సెంటర్లలో కూడా గట్టి పోటీ ఎదురు కావడంతో అక్కడ కూడా థియేటర్లు దొరకడం కష్టంగా ఉందంట. దీంతో నాగర్జున డిసప్పాయింట్ అయ్యాడట. ఈ విషయాన్ని నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం. అయితే నిర్మాతలు ,డిస్ట్రిబ్యూటర్ల మధ్య విడుదల తేదీకి సంబంధించిన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news