గుజరాత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 60 ఏళ్ల తర్వాత ఆ సిటీలో లిక్కర్ సేవించేందుకు పర్మిషన్

-

గుజరాత్లో మద్యపాన నిషేధం అమలౌతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు మందు చుక్క వాసనే తెలియని ఆ రాష్ట్రం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. గిఫ్ట్‌ సిటీగా పిలిచే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీలో మద్యానికి ఆ రాష్ట్ర సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్రంలో మాత్రం యథావిధిగా మద్య నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. గుజరాత్‌లో మద్య నిషేధం నిబంధనను తొలిసారి సడలించడం గమనార్హం.

గాంధీనగర్‌లో ఏర్పాటైన గిఫ్ట్‌ సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ఆల్కహాల్‌ సేవనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గిఫ్ట్ సిటీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఇక్కడా గ్లోబల్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విదేశాల నుంచి వచ్చే వారు, గిఫ్ట్‌సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్‌ను సేవించొచ్చని ప్రభుత్వం తెలిపింది.

గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌, ఆప్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడానికే తొలుత గిఫ్ట్‌ సిటీని ఎంచుకున్నారంటూ ఆరోపించిన కాంగ్రెస్.. ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news