తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు అన్ని రద్దు…?

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు అన్ని రద్దు అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డుదారుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారట.

Cancellation of all existing ration cards in Telangana

రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాటు, సొంత కారు కలిగి ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు….గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డు అనర్హులు అనే నిబంధనలు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టే ఛాన్స్‌ ఉందట.

అలాగే, ప్రభుత్వ, ఉద్యోగం, డాక్టర్, లాయర్ తోపాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు జారీ ఉండదని తెలుస్తోంది. టాక్స్ లు చెల్లించేవారు రేషన్ కార్డుకు అనర్హులు అని సమాచారం. వీటితో పాటు మరికొన్ని కీలక సమగ్ర సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇదే విషయం బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news