రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రేవంత్ సర్కార్. ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉండగా.. పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారు.
కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50 వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల. అలాగే.. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డుదారుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారట.
రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాటు, సొంత కారు కలిగి ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు….గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డు అనర్హులు అనే నిబంధనలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే ఛాన్స్ ఉందట.