అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించలేదు: శరద్‌ పవార్‌

-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా ప్రముఖులకు కేంద్ర సర్కార్ ఆహ్వానం పంపింది. మరోవైపు రామ్ మందిర్ ట్రస్ట్ కూడా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు.

ఇటీవల రామాలయ ప్రారంభోత్సవానికి మీరు వెళుతున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శరద్‌ పవార్‌ స్పందించారు. ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమని పవార్‌ పేర్కొన్నారు. ఏమైనా సరే ఎందరో సహకారంతో రామాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శరద్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నట్లు ఆయా పార్టీలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news