తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఆ పార్టీది కాదు : అమిత్ షా

-

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఆ పార్టీది కాదన్నారు హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్ పై కోపం తో తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. తెలంగాణలో పర్యటిస్తున్న హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌పై హోంమంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అందరు నేతల ముందే సీనియర్లకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్‌మీడియాలో బండి, ఈటల వర్గం వార్‌ సాగిన విషయం తెలిసిందే. బండికి, ఈటలకు విబేధాలంటూ పార్టీతో పాటు రాజకీయవర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో పార్టీని ఈ విభేదాలే దెబ్బకొట్టాయన్న వాదన కూడా ఉంది.ఇంకా సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కూడా అమిత్‌ షా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 4 సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా లోక్‌సభ స్థానాలపై కూడా షా ఆరా తీసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news