CID notices to Kolikipudi Srinivasa Rao : కొలికిపూడి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చేందుకంటూ హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ సిఐడి అధికారులు ఆయన కుటుంబీకుల్ని తీవ్రంగా వేధించారు. ఉద్యోగ విధులకు వెళ్లిన శ్రీనివాసరావు భార్య మాధవిని…. కార్యాలయం నుంచి ఇంటి వద్దకు వెంటనే రావాలంటూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. లేని పక్షంలో ఇంట్లోకి వెళ్తామని హెచ్చరించారు.
ఇంట్లో తమ 11 ఏళ్ల పాప, ఆమె సంరక్షకురాలు మాత్రమే ఉన్నారంటూ మాధవి చెప్పినా వినకుండా “మీ అమ్మాయికే నోటీసులు ఇస్తాం” అంటూ అమానవీయంగా వ్యవహరించారు. గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడి వారి ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే కొంతసేపు తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఆందోళన చెందిన మాధవి హుటాహుటిన తన కార్యాలయం నుంచి ఇంటికి చేరుకోగా…. అప్పటికే సిఐడి బృందాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి మాధవికి నోటీసులు అందించాయి.