తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది.

రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు, యువతి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని ప్రేమ జంటగా భావిస్తున్నారు పోలీసులు. మృతులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.