16వ ఆర్థిక కమిషన్‌ ఛైర్మన్‌గా అరవింద్‌ పనగారియ

-

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్గా నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం) మాజీ వైస్-ఛైర్మన్ అరవింద్‌ పనగఢియా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే ఈ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపింది. 16వ ఆర్థిక సంఘం సభ్యుల వివరాలను ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్, ఇతర సభ్యులు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి తుది నివేదిక సమర్పించే తేదీ వరకు లేదా 2025 అక్టోబర్ 31 వరకు ఆ పదవిలో ఉంటారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘం ఐదేళ్ల కాలానికి (2026-27 నుంటి 2030-31 వరకు) సంబంధించిన సిఫారసుల నివేదికను 2025 అక్టోబర్లో రాష్ట్రపతికి అందిస్తామని వెల్లడించింది. ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర- రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇందులో ఒక ఛైర్మన్‌, నలుగురు సభ్యులు ఉంటారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మిగతా సభ్యుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news