తిరువూరు వేదికగా కేశినేని నాని, కేశినేని చిన్ని బలప్రదర్శన

-

కేశినేని నాని, కేశినేని చిన్ని వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో… కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య ఉన్న వివాదాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ తరుణంలోనే.. తిరువూరు వేదికగా కేశినేని నాని, కేశినేని చిన్ని బలప్రదర్శనకు సిద్ధం అయ్యారు. ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు సభా ఏర్పాట్ల పరిశీలన కోసం స్థానిక నేతలతో సమావేశం కావటానికి విడి విడిగా వెళ్తున్నారు కేశినేని నాని, కేశినేని చిన్ని.

Keshineni Nani and Keshineni Chinni performance at Tiruvuru venue

చీమలపాడు నుంచి భారీ ర్యాలీగా వెళ్లనున్నారు కేశినేని చిన్ని. బెజవాడ పార్లమెంట్ సీటు వివాదం మొదలయ్యాక తొలిసారి కేశినేని బ్రదర్స్ ఒకేచోటుకు వెళ్ళటం ఇదే ప్రథమం కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి రావాలని మనే మాజీ మంత్రి ఉమాకు కేశినేని నాని ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఎంపీ నాని లేదా పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టేం రఘురాం ఫోన్ చేయకుండా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రమ్మనటం ఏంటని ఉమా అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news