కొత్త మండలాలు, జిల్లాలు రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ కుట్రలు – హరీష్‌ రావు

-

కొత్త మండలాలు, జిల్లాలు రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందని ఫైర్‌ అయ్యారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్‌ జిల్లా మనోహ రబాద్ (మం) జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు…అనంతరం మాట్లాడారు. BRS పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది…బట్టకాల్చి మీద వేసి రకరకాల కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.

harish rao

ఎన్ని రోజులు కుట్రలు చేసిన నిజాలు త్వరలోనే తెలుస్తాయి…ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా అని నిలదీశారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారు…గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారు.. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? అని నిలదీశారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత అని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news