మంత్రి రోజాపై మళ్లీ బండారు సత్యనారాయణ వివాదస్పద వ్యాఖ్యలు

-

మంత్రి రోజాపై మళ్లీ టిడిపి సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా వేసిన ప్రైవేట్ కేసు విచారణలో భాగంగా నగిరి జిల్లా కోర్టుకు హాజరయ్యారు బండారు సత్యనారాయణ. టిడిపి కార్యకర్తలను వేధించడం అన్నది జగన్ ఆనవాయితీ చేసుకున్నాడు..బెదిరించి అధికారంలో ఉండాలని జగన్ చూస్తున్నాడని ఆగ్రహించారు.

Bandaru Satyanarayana’s controversial comments on Minister Roja again

నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది..రోజా ముందు తన నోరును సరిచేసుకోవాలని మండిపడ్డారు. ఆదారాలు లేకుండా చంద్రబాబు ను అరెస్టు చేశారు.. ఇక నాపైనా గుంటూరు ,నగరి నుంచి చాలా చోట్లు దోంగ కేసులు పెట్టారని ఫైర్‌ అయ్యారు. నెల రోజుల్లో చంద్రబాబు, పవన్ పాలనా వస్తుంది… జగన్ నాశనం చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల తరువాత జగన్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉండడు…
జగన్ కు మిగిలేది చంచల్ గూడా జైలే అంటూ విమర్శలు చేశారు టిడిపి సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news