BREAKING: పీసీసీ పదవికి గిడుగు రాజీనామా..షర్మిలకు బాధ్యతలు ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పిసిసి అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆయన రాజీనామాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కు పంపించారు. ఇక గిడుగు రుద్రరాజు రాజీనామాతో… వైయస్ షర్మిలకు లైన్ క్లియర్ అయిందని కొంతమంది అంటున్నారు. షర్మిల కోసమే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి ఉంటారని తెలుస్తోంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా షర్మిలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news