Sai Pallavi: త్వరలోనే హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు..!

-

ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత డ్యాన్సింగ్ క్వీన్ గా మంచి పేరు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో మలయాళ చిత్రం ప్రేమలో కూడా హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇక ఫిదా సినిమా తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు , మారి 2 వంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ చిన్నది.

Sai Pallavi Sister Marriage

అయితే, హీరోయిన్ సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమె తన లవర్ ను అభిమానులకు పరిచయం చేశారు. ‘నిస్వార్ధంగా ప్రేమించడం…. ప్రేమలో ఓపికగా ఉండటం ఇతడిని చూసి తెలుసుకున్న. ఇతను వినీత్. నిన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్…. ఇకపై జీవిత భాగస్వామి’ అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పూజ కన్నన్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం సోషల్ వర్కర్ గా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news