మహేశ్‌బాబు ఇంట్లో ‘గుంటూరు కారం’ బ్లాక్‌బస్టర్ వేడుకలు

-

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ ఈనెల 12న విడుదల థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఇంట్లో మూవీ బ్లాక్ బస్టర్ వేడుకలు జరిగాయి.

Mahesh Babu Celebrates Guntur Kaaram Success With Sreeleela, Meenakshi Chaudhary

ఈ కార్యక్రమానికి హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షి చౌదరి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ ఫోటోలను మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వేడుకల్లో త్రివిక్రమ్ కనబడలేదు.

కాగా, ‘గుంటూరు కారం’ సినిమాతో మహేశ్ బాబు రికార్డు సృష్టించారు. మిక్స్డ్ టాక్ వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. USAలో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను దాటగా…. ప్రిన్స్ కెరీర్ లో ఈ ఘనత సాధించిన 5వ సినిమాగా నిలిచింది. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట చిత్రాలు ఈ ఘనతను అందుకోగా…. ప్రభాస్ తర్వాత ఈ రికార్డు సాధించిన హీరోగా సూపర్ స్టార్ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news