Pushpa 2 OTT Update: పుష్ప 2 ఓటీటీ పార్ట్‌నర్ ఇదే..

-

Pushpa 2 OTT Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రస్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

Pushpa 2 The Rule OTT details revealed

అయితే, సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news