కుర్తా చిరిగిందని ఆయనకు విరాళమిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేశారు : మోదీ

-

బిహార్‌ రాష్ట్రంలో ‘జన నాయక్‌’గా ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన 100వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కర్పూరీ ఠాకూర్ నిరాడంబరతను చాటిచెప్పే ఓ సంఘటనను మోదీ తన బ్లాగ్లో పోస్టు చేశారు.

“1977లో ఠాకూర్ జీ బిహార్ సీఎంగా అప్పుడే బాధ్యతలు చేపట్టిన సమయమది. అప్పుడు దిల్లీ, పట్నాలో జనతా సర్కార్దే అధికారం. ఆ సమయంలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన రోజును జనతా నేతలు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు బడా నేతలు హాజరయ్యారు. అదే వేడుకకు ఠాకూర్ జీ కూడా వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయన చిరిగిన కుర్తాతో కనిపించడంతో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ.. ఠాకూర్ జీ కొత్త కుర్తా కొనుక్కునేందుకు విరాళం ఇవ్వాలని ప్రజలను అడిగారు. క్షణాల్లో విరాళాల సేకరణ జరగ్గా విరాళం అందుకున్న ఠాకూర్ జీ ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేశారు. ఠాకూర్ జీ గురించి తెలిసిందే కదా. ఆయన నిస్వార్థ సేవానిరతికి ఇదో అందమైన ఉదాహరణ” అంటూ ప్రధాని మోదీ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news