ఎయిర్ ఇండియా కి డీజీసీఏ రూ.1.10 కోట్లు జరిమానా..?

-

విమానాల్లో అనేక ఇబ్బందులు ఉంటాయి అయితే వాటిని అన్నిటిని కూడా ఎయిర్లైన్స్ చూసుకుంటూ ఉండాలి అయితే భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూ.1.10 కోట్ల భారీ జరిమానాన్ని విధించింది అయితే కొన్ని రూట్లలో భద్రత ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపిస్తూ ఒక ఎయిర్లైన్ ఉద్యోగి ద్వారా రెగ్యులేటరీ కి భద్రతా నివేదిక అందింది. దీంతో చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొన్ని సుదూర క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఎయిర్ లైన్ ఉద్యోగి డీజీపీఏ కు కంప్లైంట్ చేయడం జరిగింది.

దీంతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్ ఇండియా మీద ఫిర్యాదు తీసుకుని విచారణ జరిపింది భద్రత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తేలిందని నివేదిక చెప్పింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా రెగ్యులేటర్ ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ కి షో కాస్ నోటీస్ జారీ చేసింది. రెగ్యులేటరీ నిబంధనలతో పాటుగా పనితీరు పరిమితులకు అనుగుణంగా లేజీకు తీసుకుంటున్న విమానాల్ని సరిగా నడపడం లేదని ఫైన్ వేసింది

Read more RELATED
Recommended to you

Latest news