తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను మే రెండవ వారం నుంచి నిర్వహించనున్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు ఎంసెట్ తో పాటు ఐసెట్, ఎడ్ సెట్, పిజిసెట్, లాసెట్ తేదీలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఎంసెట్ పేరు మార్పుపై జీవో జారీ అయితే ఇవాళ సాయంత్రానికే పరీక్షల తేదీలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో ఈసెట్, మే చివరివారం నుంచి జూన్ తొలి వారంలో పీఈసెట్, పీజీఈసెట్ జరగనున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను బుధవారం రోజున రాజ్‌భవన్‌లో కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు గవర్నర్తో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించనున్న వేడుకలకు తమిళిసైని సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆహ్వానించారు.