బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు జేడీఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్‌కుమార్. అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు నితీష్‌కుమార్.
9వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్..మళ్లీ ప్రమాణం చేస్తారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు నితీష్. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. రేణుదేవి, సుశీల్‌మోడీలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించనున్నారు. ఇక ఈ తరుణంలోనే… నేడు పాట్నాకు అమిత్‌షా, జేపీ నడ్డా వెళతారు.
కాగా, అమిత్ షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా హైదరాబాదులో ప్రకటన విడుదల చేశారు. బీహార్ పరిణామాలతో అమిత్ షా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.