నీతీశ్‌ కుమార్ ఊసరవెల్లితో పోటీ పడుతున్నారు: కాంగ్రెస్‌

-

బిహార్ సీఎం పదవికి జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహాకూటమికి గుడ్బై చెప్పిన ఆయన ఇవాళ సాయంత్రం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నీతీశ్పై మహాకూటమి నుంచి, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే నితీశ్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది.

బిహార్ ప్రజల అభీష్టాన్ని ఆయన తరచూ విస్మరిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్ అయింది. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో క్షమించబోరని పేర్కొంది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను చూసి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ భయపడుతోందని దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెరతీశారని వ్యాఖ్యానించింది.

మరోవైపు నీతీశ్‌ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ముందే చెప్పారని తెలిపారు. నీతీశ్‌ లాంటి ‘ఆయా రామ్‌.. గయా రామ్‌’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news