ఏకంగా ఇన్ని కోట్లు పెట్టి రామ్ చరణ్ సినిమానా..? వివరాలు లీక్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాని చేయడానికి ఒప్పుకున్నారు. అలానే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా తెర మీదకి రాబోతోంది ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే బుచ్చిబాబుతో ఒక సినిమాని ఒప్పుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి ఒక వార్త విపరీతంగా షికార్లు కొడుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతోందట శంకర్ సినిమా పూర్తి అవ్వగానే రామ్ చరణ్ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది ఏకంగా ఈ సినిమా కోసం 400 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు టాక్ పైగా ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా స్టార్లు కూడా ఉంటారని తెలుస్తోంది భారీ బడ్జెట్ తో రాబోతున్నాయి మూవీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news