వనమా వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ సమావేశం లో పలు కామెంట్స్ చేసారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు అహర్నిశలు శ్రమించాలి అని ఆయన అన్నారు. కెసిఆర్ అంటేనే నా దేవుడు.. కెసిఆర్ పిలుపే మనకు శిరోధార్యం అని అన్నారు. మన అభ్యర్థుల ఓటమి పై సుదీర్ఘ మైన చర్చ జరగాలి అని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు ఏకగ్రీవంగా పార్లమెంటు సభ్యుడుగా నామా నాగేశ్వరరావు ని సెలెక్ట్ చేయడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాజకీయ జీవితం నాది అని ఆయన అన్నారు. కొత్తగూడెం గడ్డ అంటే వనమా గడ్డ అన్నారు. నా ఓటమి ఊహించని పరిణామం, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఒక గాలి వాటం అని అన్నారు. నా ఓటమి పై ఎవ్వరిని నింధించను
మన ఓటమి మనకు ఒక గుణపాఠం అని అన్నారు.