విశాఖలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో టీం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా కొత్త రికార్డును సృష్టించారు. మొత్తం ఆరు వికెట్లను పడగొట్టి టెస్టుల్లో అత్యంత వేగంగా (34 మ్యాచులు) 150 వికెట్లు సాధించిన భారత పేస్ బౌలర్‌గా నిలిచారు. అశ్విన్ 29 మ్యాచుల్లో, జడేజా 32 మ్యాచుల్లో ఈ మైలురాయిని చేరారు. వేగంగా 150 వికెట్లు తీసిన తొలి ఐదుగురు భారత బౌలర్లలో బుమ్రా మాత్రమే పేసర్ కావడం విశేషం.
తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లండ్ 253 రన్స్‌కు కుప్పకూలింది. దీంతో ఇండియకు 143 పరుగుల ఆధిక్యం దక్కగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. దీంతో ఇండియా ఆధిక్యం ఓవరాల్‌గా 171 రన్స్ కు చేరింది. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్ (17 బంతుల్లో 15 బ్యాటింగ్, 3 ఫోర్లు), రోహిత్ శర్మ (13 బంతుల్లో 13 నాటౌట్, 3 ఫోర్లు) ఉన్నారు.