రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగింది.లోక్సభలో ప్రసంగం సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు .ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరించారని అన్నారు.వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ‘దేశ శక్తి, సామర్థ్యాలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నమ్మకం లేదు. ప్రధానిగా నెహ్రూ తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలిస్తే భారతీయులకు నైపుణ్యం లేదని అన్నారు. నెమ్మదిగా, సోమరుల్లా పని చేస్తారని అన్నారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువ కాదు. భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువ అని అన్నారు. వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ దుకాణం మూతపడే సమయం వచ్చింది’ అని మండిపడ్డారు.
మైనార్టీలకు ఏం చేయలేదన్న ఓ ప్రతిపక్ష విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘మీ దృష్టిలో మత్స్యకారులు ,రైతులు , పశువుల కాపరులు , మహిళలు మైనార్టీలు కాకపోవచ్చు … మరి మీకు ఏమైంది? ఇంకెన్నాళ్లు విభేదాల గురించి ఆలోచించి సమాజాన్ని చీలుస్తారు’ అని మండిపడ్డారు.