ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ పునఃనిర్మాణం : కిషన్ రెడ్డి

-

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పరిశీలించారు. 750 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2025 కల్లా ఎయిర్‌పోర్టు తరహాలో ఈ స్టేషన్ రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. అదే విధంగా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తారని కిషన్‌ రెడ్డి చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 25లిఫ్ట్ లు, 32 ఎస్కలెటర్స్ స్టేషన్ లో అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో, ఆర్టీసి బస్సులకు అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో అందమైన నిర్మాణంగా స్టేషన్ అందుబాటులోకి రాబోతుందన్న ఆయన మోదీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు. క్యాంటీన్, రిక్రియేషన్, రిటైల్ షాపులు, కెఫెటేరియా, ఇతర వసతులు కూడా అందుబాటులోకి వస్తాయని వివరించారు. 2025లో కూడా నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news