జపాన్‌లో హిమపాతం.. గడ్డ కట్టిన నీళ్ల నడుమ చిక్కిన కిల్లర్‌ వేల్స్‌.. రక్షణ చర్యలకు ఆటంకం..!

-

ఇటీవల జపాన్‌లో మొదలైన రికార్డు స్థాయి హిమపాతం ‘కిల్లర్‌ వేల్స్‌’కు ప్రాణాంతకంగా మారింది. మూగజీవాలకు సంబంధించిన దృశ్యాలు జపాన్ కి చెందిన జాతీయ టెలివిజన్ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో తీరంలో గల రౌస్‌ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో నీరు గడ్డ కట్టింది. 10 కిల్లర్ వేల్స్ గడ్డ కట్టిన నీటిమధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో కదలడానికి కూడా వీల్లేని స్థితిలో ఉన్నాయి. తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొంటున్నాయి.

 

ఏటా కిల్లర్ వేల్స్ ను ప్రత్యక్షంగా చూడడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు.మూగ జీవాలు పడుతున్న అవస్థలు చూసి జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిల్లర్ వేల్స్ ను రక్షించడానికి అక్కడికి చేరుకోవడం కోసం కోస్ట్ గాడ్స్ కు సవాలుగా మారింది . అక్కడ నీరు మొత్తం మందపాటి మంచు పలకం వలె మారిపోయింది. మంచు కరిగి విరిగిపోయే వరకు అక్కడికి వెళ్లలేమని అధికారులు చేతులెత్తేశారు.

Read more RELATED
Recommended to you

Latest news