భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి

-

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం రోజున ప్రారంభమైంది. దీంతో భక్తులు పరవశంలో మునిగిపోతున్నారు. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉండగా.. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. అయితే వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి తాజాగా దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్తపతి దండపాణి సారథ్యంలో శిల్పకళ ఉట్టిపడే విధంగా ఈ వాకిలి తయారు చేశారు. కోవెలలో ఉన్న 70 కిలోల పాత రజతానికి తోడు హైదరాబాద్‌కు చెందిన దాత మరో 30 కిలోల వెండిని అందించారు. స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన వెండి వాకిలి విశేషంగా ఆకట్టుకుంటోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు భద్రాద్రిలో ఇకపై శుక్రవారం కూడా అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news