రేపటి నుంచే హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫెయిర్

-

హైదరాబాద్‌లో రేపటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శనశాల ప్రదర్శన ప్రారంభం కానుంది. రేపటి నుంచి పది రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుంది. అన్ని భాషల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది 365 స్టాళ్లు ఏర్పాటు చేశారు. నగరంలోని దోమలగూడలోని ఎన్టీఆర్‌ మైదానంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లే ‘పుస్తక ప్రదర్శనశాల’ ఈనె‌ల 9 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తెలిపారు. దోమలగూడలోని ఎన్టీఆర్‌ మైదానంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు పెట్టినట్లు గౌరీశంకర్‌ చెప్పారు. ఈ వేదికకు సంస్కృత పండితులు రవ్వా శ్రీహరి పేరు, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండి, జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టినట్లు వివరించారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు, శని, ఆదివారాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుందన్నారు‌.

Read more RELATED
Recommended to you

Latest news