HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఏసీబి కోర్టు విచారణ ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. వివరాలు చూస్తే.. శివ బాలకృష్ణ బెయిల్ మంజూరు చెయ్యొద్దని కోర్టు కు ఏసీబి చెప్పింది.
ఇది ఇలా ఉంటే శివ బాలకృష్ణ ను ఇప్పటికే 8 రోజులు ఏసీబి కస్టడీ పూర్తి అయ్యింది. అయితే బెయిల్ మంజూరు చెయ్యాలని బాలకృష్ణ తరపు న్యాయవాది కోరారు. ఇరు వాదనలు విన్నాక బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ఇస్తామని నాంపల్లి ఏసీబి కోర్టు చెప్పింది.