రొయ్యలంటే ఇష్టమా..తినేప్పుడు ఈ తప్పు చేశారంటే ప్రాణాలకే ప్రమాదం

-

రెడ్‌ మీట్‌ కంటే.. సీ ఫుడ్స్‌ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తుంటారు. వీటిని వారానికి రెండు మూడుసార్లు తిన్నా ఎలాంటి సమస్య ఉండదు. అయితే చేపలు అయినా, రొయ్యలైనా..జాగ్రత్తగా తినాలి, అంతే జాగ్రత్తగా వండాలి కూడా. వీటిని శుభ్రపరచడం అనేది పెద్ద టాస్క్‌. చేపల తర్వాత రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో చేసిన ఏ వంట అయినా సూపర్‌గా ఉంటుంది.

రొయ్యలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రొయ్యల్లో క్యాలరీలు, ప్రొటీన్లు, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, నియాసిన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి12, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే రొయ్యలను క్లీన్‌ చేసేప్పుడు అందులో ఉండే నల్లటి సిర, వ్యర్థపదార్థాలను తొలగించాలి. ఇది కడుపు నొప్పి నుంచి రక్త నాళాల వాపు వరకు ఏదైనా కావచ్చు. దీని వల్ల చాలా మందికి శ్వాస సమస్యలు ఉన్నాయి. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు.

రొయ్యలను శుభ్రపరిచేటప్పుడు తల, కాళ్ళు, ఈ నల్ల సిరను తొలగించండి..కొంతమంది ప్యాక్‌ చేసిన రొయ్యలను తీసుకుంటారు. గాలిచొరబడకుండా ప్యాక్‌ చేసినవి అయితేనే తీసుకోవాలి. అందులో మంచి స్పటికలు, గాలి ఉంటే.. వాటిని కొనుగోలు చేయకండి. రొయ్యలను మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తర్వాత వాటిని బాగా కడగాలి. ఫిష్ షెల్ తోక పైభాగాన్ని తీసేయండి. చాలామంది తల భాగాన్ని కూడా వదిలివేస్తారు. కాకపోతే, చాలా బాగా శుభ్రం చేయండి.

రొయ్యలను, చేపలను క్లీన్‌ చేయడానికి అనుభవం ఉండాలి.కూరగాయలు కడిగినట్లు కడిగితే సరిపోదు. వాటిల్లో కొన్ని తీసేయాల్సిన పదార్థాలు ఉంటాయి. వాటిని కచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది. పైసలు పెట్టి కొన్నాం కదా.. అన్నీ పారేస్తే ఎలా అనుకుంటే.. చాలా ప్రమాదం అవుతుంది మరీ.

రొయ్యలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చూస్తుంది.
రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది.
రొయ్యల్లోని సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. రక్త సరఫరాకు అడ్డుపడే కొవ్వును తొలగిస్తుంది.
మాంసాహారాలన్నింటిలోకెల్లా రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు రొయ్యలను తినడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news