బోండా ఉమా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడారు. జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలి అని అన్నారు. చంద్రబాబు – అమిత్ షా భేటితో వైసీపీ గజగజ వణికి పోతుంది అని అన్నారు. అలానే జగన్ అర్ధరాత్రి వరకు ఎదురు చూసినా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని అన్నారు.
జగనులా మేం లాలూచీ రాజకీయాలు చేయం అని అన్నారు. నిన్న జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకి వైసీపీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అని చెప్పారు. 60 శాతం ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం ని సాధిస్తోంది అని అన్నారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుండి మంత్రులు ఎమ్మెల్యేలు పరార్ అయ్యారని అన్నారు.