ఏపీ రాజకీయాల ప్రస్తుతం హీట్ ఎక్కిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాలు హస్తినకి చేరుకుంటున్నట్లు అయింది. అయితే బిజెపితో చంద్రబాబు చర్చల మీద పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు ఆయన కృష్ణాజిల్లాలో మీడియాతో మాట్లాడారు బీజేపీతో చంద్రబాబు అర్ధరాత్రి చర్చలు జరపడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వంతో చర్చలు జరిపితే మంచిదేనా అని అన్నారు. అయితే 2014లో బిజెపి రాష్ట్రానికి అవసరం అన్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు. 2019 వరకు కలిసి ఉండే చివర్లో మోసం చేసిందని బిజెపిని తిట్టారని అన్నారు. మోడీకి భార్య పిల్లలు కుటుంబం లేని వ్యక్తి నాతో పోటీనా అని చంద్రబాబు విమర్శించారని అన్నారు. కలిసి పోటీ చేయడంపై చర్యలు ఎందుకని ప్రజలకు సమాధానం చెప్పాలని నాని అన్నారు.