కాలేశ్వరం ప్రాజెక్టుపై తమ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా KRMB పరిధిలోని అంశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై నిపుణులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 13న ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు.
ఇక అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే రేపు మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సమావేశాలను 14, 15 తేదీల్లోనూ నిర్వహించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.