KA paul : సీఎం రేవంత్ తో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా పేర్కొన్నారు. ‘కేసీఆర్ ఓ నియంత. ఆయన పాలనలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. రేవంత్ పర్ఫెక్ట్ లీడర్. ప్రజా సేవకుడు. ఇకపై తెలంగాణ ఆర్థిక పరిస్థితి మారుతుంది. నేను రేవంత్ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తాం. విదేశాల నుంచి మనకు పెట్టుబడులను తీసుకొస్తాం’ అని వాక్యానించారు KA పాల్.
ఇది ఇలా ఉండగా, కాలేశ్వరం ప్రాజెక్టుపై తమ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా KRMB పరిధిలోని అంశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై నిపుణులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 13న ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు.