‘దిల్లీ ఛలో’ కు రైతుల పిలుపు.. పోలీసులు హై అలెర్ట్

-

తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 13వ తేదీన దిల్లీ చలో పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల సరిహద్దులను మూసివేశారు. అక్కడ భారీగా బలగాలను మోహరించారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచిన పోలీసులు పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు.

అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను నిలిపి ఉంచి అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో సెక్షన్‌ 144ను విధించిన పోలీసులు తమ సూచనలు అనుసరించి ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని కోరారు. దిల్లీ చలోలో పాల్గొనకుండా నివారించేందుకు ఖాప్‌ పంచాయతీలు, పలు గ్రామాల సర్పంచులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది రైతులు దిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. కొందరు రైతులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, అర్జున్‌ ముండా సహా పలువురు బీజేపీ సీనియర్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news