మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన సీఎం రేవంత్‌, ఎమ్మెల్యేలు

-

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరివెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో అందరు పయనమయ్యారు. ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఆలస్యంగా కారులో బయలుదేరారు. ఎంఐఎం సభ్యుల కోసం ఉప్పల్ వద్ద ఎమ్మెల్యేల బస్సులు ఆగాయి. మధ్యాహ్నం 3 గంటలకు వీరంతా బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, సుమారు 800 మంది పోలీసు బందోబస్తులో పాల్గొంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో.. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు బ్యారేజీ ప్రాంతంలో వ్యూపాయింట్‌ వద్ద సుమారు 3 వేల మంది కూర్చోవడానికి వీలుగా సభా స్థలిని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని  సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news