మన అంతిమ లక్ష్యం కార్మిక, కర్షక వర్గాల శ్రేయస్సే అని కూనమనేని సాంబశివ రావు అన్నారు. మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది బిజెపి అని అన్నారు. నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి, మళ్ళీ పాత పద్దతులను అమలు చేస్తుంది అని కూనమనేని సాంబశివ రావు అన్నారు. అందుకనే రైతులు ఆందోళన చేస్తున్నారు అని అన్నారు.
రబ్బర్ బుల్లెట్ లతో వారిని చెదరగొట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
చట్టాలను ఇష్టానుసారంగా మారుస్తున్నారు. కార్మికులకు భద్రత లేదు. చట్టాలను అమలు చేయకుండా వెట్టి చేయిస్తున్నారు అని కూనమనేని సాంబశివ రావు అన్నారు. అందరికీ సమాన హక్కులు ఉన్నా కూడా పేదవారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా కేంద్ర చర్యలు ఉన్నాయన్నారు.