డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వడ్డీలేని రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
చాలాకాలం నుంచి జీతాలు రావడం లేదని ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారని…వారికి జీతాలు అందేలా చూస్తానని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని భట్టి చెప్పారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని.. అర్హులైన అందరికీ రుణాలు ఇస్తామన్నారు. కుల, మత, బేధ అనే తేడాలు లేకుండా అందరికీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం..మహిళ కోసం పనిచేసేది అని గుర్తు చేశారు.