రాష్ట్ర గవర్నర్ తమిళిసై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాలు మొక్కు తీర్చుకున్నారు. ఉదయం 11:5 నిమిషాలకే మేడారం మహా జాతరకి చేరుకున్నారు. గవర్నర్ ని మంత్రి సీతక్క, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ తో పాటుగా ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య తదితరులు తో పాటుగా పూజారులు కూడా స్వాగతం పలికారు. గద్దెల వద్దకు చేరుకున్న గవర్నర్ వనదేవతలకి పట్టు వస్త్రాలని బంగారాన్ని సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కూడా వనదేవతలు వద్దకి వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ క్రమం లోనే మేడారం మహా జాతర సందర్భంగా వనదేవతల్ని గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు.