ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే మృతదేహానికి పటాన్చెరువు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు అయితే ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం డ్రైవర్ నిద్ర మత్తు అని పోలీసులు అనుమనిస్తున్నారు. డ్రైవర్ కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశారు ఈ క్రమంలో ఆక్సిడెంట్ జరిగింది. అదుపుతప్పి కారు అవుటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్ ని ఢీ కొట్టింది.
ఇంకొకరణం ఏంటంటే ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదు దాని వలన ఇంటర్నల్ పార్ట్స్ డామేజ్ అయ్యాయి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే గాయాలతో బయటపడేవారు. మూడవ కారణం ఆమె ప్రయాణిస్తున్న మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉంది అది తెలిసి కూడా వారు అతివేగంగా ప్రయాణించడం ప్రమాదానికి ఇంకొక కారణం అని పోలీసులు చెప్తున్నారు. ఆరు దంతాలు ఊడిపోయాయని తై బోన్స్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అని పోస్ట్ మార్టం లో తెలిసింది. అలానే లెఫ్ట్ లెగ్ కూడా పూర్తిగా విరిగిపోయినట్లు తెలిసింది. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయి.