ఓటీటీ లోకి యాత్ర 2.. ఎప్పుడంటే..?

-

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నడంతో టాలీవుడ్ లో పొలిటికల్ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. యాత్ర 2 సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 8న రిలీజ్ అయింది ఈ సినిమాకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. సీఎం జగన్ గురించి అందరికీ తెలిసిన. ఆయన కథ ని దర్శకుడు ఈ సినిమాలో చూపించారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారి తీసిన పరిణామాలు, అలానే సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్దతు తొలిసారి సీఎం గా ఎలా ఎన్నికయ్యారు అనే వాటి గురించి ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ నటించారు. ఏ ఓటీటీ సంస్థలు యాత్ర టు సినిమాని కొనడానికి ముందుకు రావట్లేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి సెకండ్ వీక్ ఈ సినిమా వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాలి.

Read more RELATED
Recommended to you

Latest news