బీఆర్ఎస్ కి బిగ్ షాక్..!

-

మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి శనివారం నాడు ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి నివాసగృహంలో మర్యాదగాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్చాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తీగల కృష్ణారెడ్డి చర్చలు కొనసాగిస్తున్నారు. ఆయన కోడలు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది.

విదేశీ పర్యటన ముగించుకుని ఇటీవల వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ తీగలు అనిత రెడ్డి తీగల కృష్ణారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కలవడంతో అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏది ఏమైనా ఇద్దరి నేతలు మహేశ్వరం నియోజకవర్గంలో బిఆర్ఎస్ ని విడిచి పెట్టడం దాదాపు ఖాయమైంది దీంతో గట్టి షాకే తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news