Vizag: ఆర్కేబీచ్‌లో తొలి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభం

-

విశాఖ వైఎంసిఏ సమీపంలో ఫ్లోటింగ్ బ్రిడ్జినీ ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ….విశాఖ బీచ్ లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

AP’s first floating sea bridge in Vizag

ఈ ప్లోటింగ్ బిడ్జ్ వలన పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని వివరించారు. జగన్ మోహన్ రెడ్డి… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వివిద బీచ్ ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందన్నారు. విశాఖ నుండే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుందని చెప్పారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news