బయో ఆసియా సదస్సులో 50 మిలియన్‌ డోస్‌ల డెంగ్యూ వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం ఒప్పందం

-

హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా 21వ బయో ఆసియా – 2024 సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై ఇందులో చర్చిస్తున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 50 మిలియన్‌ డోస్‌ల డెంగ్యూ వ్యాక్సిన్ల కోసం విదేశీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

ఐటీ రంగంలో మార్పులకు అనుగుణంగా లైఫ్ సైన్సెస్ పాలసీ ఉంటుందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. లైఫ్‌ సెన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ను చేయబోతున్నామని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొనసాగిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు.. ఫార్మా క్లస్టర్లు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏడాదికి 5 కోట్ల వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని బయోలాజికల్‌-ఈ తో కలిసి జపాన్‌ సంస్థ తకేడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news