ఎవరెన్ని విమర్శలు చేసినా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో భాగంగా మరో రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభిస్తున్నారు. ఈ రెండు గ్యారెంటీలలో రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్ లున్నాయి. ప్రజాపాలన పేరు మీద గ్రామసభలు నిర్వహించి.. ప్రజల వద్దకు వెళ్లి.. గ్రామాల్లో ఈ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్దిదారులకు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం.
చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని లక్ష మంది కార్యకర్తలతో ప్రియాంక గాంధీ సభకు హాజరై ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం.. పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు, వివిధ జిల్లాల్లో ఉండటం వల్ల ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో ఇవాళ సచివాలయంలో ప్రారంభించుకున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.